తక్కువ ధరకే మొబైల్ అంటూ కుచ్చుటోపీ... పార్శిల్ విప్పి చూస్తే...!

  • తక్కువ ధరకే మొబైల్ ఫోన్లు అంటూ ఆన్‌లైన్ మోసాలు
  • హైదరాబాద్‌లో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్
  • ఫోన్ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో బ్లూటూత్ స్పీకర్లు, హెర్బల్ ఉత్పత్తులు
ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే శాంసంగ్ మొబైల్ ఫోన్ ఇస్తామని నమ్మించి, ఆర్డర్ చేసిన వారికి బ్లూటూత్ స్పీకర్లు, హెర్బల్ ఉత్పత్తులు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడలో ఉన్న ఓ కార్యాలయంపై పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన ఎస్. విజయ్ కుమార్ ఈ మోసాలకు ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. శివకుమార్, ముద్దీన్, శశికాంత్‌లను అరెస్ట్ చేశారు. విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో తాను కూడా ఇలాంటి ఆన్‌లైన్ మోసంలో డబ్బులు పోగొట్టుకున్న విజయ్ కుమార్, సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఈ ముఠా ఐదేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నట్లు, 2021 నుంచి ఇప్పటివరకు సుమారు 3,880 మందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ టెలీకాలర్లతో ఫోన్లు చేయించి, డబ్బులు కట్టించుకున్నాక తక్కువ విలువైన వస్తువులను పోస్టు ద్వారా పంపేవారు. నిందితుల కార్యాలయం నుంచి పోలీసులు 1.40 లక్షల నగదు, 50 సిమ్ కార్డులు, ల్యాండ్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
 

Vijay Kumar
Samsung mobile
online fraud
Hyderabad police
cyber crime
Rajendranagar
Shamshabad
Karnataka
bluetooth speakers
herbal products

More Telugu News